అంతర్జాతీయ దిన రేఖ
అంతర్జాతీయ తేదీ రేఖ (IDL) అనేది భూమి యొక్క ఉపరితలంపై అంతర్జాతీయంగా ఆమోదించబడిన సరిహద్దు. ఇది ఉత్తర ధృవం, దక్షిణ ధృవాల మధ్య గుండా పోతుంది. ఈ రేఖ ఒక క్యాలెండర్ రోజు, తదుపరి రోజు మధ్య సరిహద్దుగా పనిచేస్తుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం గుండా వెళుతుంది. ఇది కొన్ని భూభాగాలు, ద్వీప సమూహాల చుట్టూ పోతూ సుమారుగా 180° రేఖాంశాన్ని అనుసరిస్తున్న ఊహాజనితమైన రేఖ.
భౌగోళికం
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ దిశగా ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా తమ గడియారాలను సెట్ చేసుకోవాలి:
- దాటిన ప్రతి 15° రేఖాంశానికి ఒక గంట వెనుకకు సమయాన్ని మార్చుకోవాలి.
- అంతర్జాతీయ తేదీ రేఖను దాటిన తర్వాత 24 గంటలు ముందుకు వెళ్ళాలి.
తూర్పు వైపు ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ గడియారాలను సెట్ చేసుకోవాలి:
- దాటిన ప్రతి 15° రేఖాంశానికి ఒక గంట ముందుకు సమయాన్ని మార్చుకోవాలి.
- అంతర్జాతీయ తేదీ రేఖను దాటిన తర్వాత తిరిగి 24 గంటలు వెనుకకు వెళ్ళాలి.
దీన్ని చేయడంలో విఫలమైతే వారి సమయం స్థానిక సమయానికి సరికాదు.
అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త అబుల్ఫెడా (1273–1331) భూ ప్రదక్షిణలు చేసేవారు స్థానిక తేదీకి ఒక-రోజు కలిపి పూర్తి చేస్తారని అంచనా వేశారు.[1] ఈ దృగ్విషయాన్ని 1522లో మొదటి విజయవంతమైన భూ ప్రదక్షిణ చేసిన మాగెల్లాన్-ఎల్కానో (1519-1522) చేసిన ప్రదక్షిణ ముగింపులో నిర్ధారించబడింది. స్పెయిన్ నుండి ప్రపంచవ్యాప్తంగా యాత్రలో భాగంగా పడమటివైపు ప్రయాణించిన తర్వాత, 1922 జూలై 9 (ఓడ సమయం) బుధవారం నాడు కేప్ వెర్డే చేరాడు. అయితే, స్థానికులు అది వాస్తవానికి 1522 జూలై 10 గురువారం అని చెప్పారు. మూడు సంవత్సరాల ప్రయాణంలో ప్రతి రోజును మరచిపోకుండా రికార్డ్ చేయడంతో సిబ్బంది ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయారు.[2] స్పెయిన్‌లోని వెనీషియన్ రాయబారి కార్డినల్ గ్యాస్‌పారో కాంటారిని ఈ వైరుధ్యానికి సరైన వివరణ ఇచ్చిన మొదటి యూరోపియన్.[3]
మూలాలు
[మార్చు]- ↑ Gunn, Geoffrey C. (15 October 2018). Overcoming Ptolemy: The Revelation of an Asian World Region. Lanham, Maryland: Lexington Books. pp. 47–48. ISBN 9781498590143.
- ↑ Neal, Larry (1993). The Rise of Financial Capitalism: International Capital Markets in the Age of Reason. Cambridge University Press. p. 1. ISBN 978-0-521-45738-5.
- ↑ Winfree, Arthur T. (2001). The Geometry of Biological Time (in ఇంగ్లీష్) (2nd ed.). New York: Springer Science & Business Media. p. 10. ISBN 978-1-4757-3484-3.